పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 పెరిగి రూ.87,980కు చేరింది.
మరో వైపు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ ధర రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే.