తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,490కు చేరింది.
అటు వెండి ధర కూడా రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ ధర రూ.1,07,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.