మాజీ ఎంపీ కన్నుమూత
అనంతపురం మాజీ లోక్ సభ సభ్యుడు దరూరు పుల్లయ్య (93) సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. బళ్లారి నగరంలోని దరూరు పుల్లయ్య కాంపౌండ్లో ఆయన నివాసం ఉంటున్నారు. సోమవారం బళ్లారి నుంచి కంప్లి కొట్టాల వద్దనున్న పొలాన్ని చూడటానికి కారులో వెళ్లారు. పొలం చూసి ఇంటికి వస్తుండగా కంప్లిలో రోడ్డు పక్కన ఉన్న స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగారు. అక్కడే కుప్పకూలిపోయి మరణించారు.