లలిత్ మోడీకి భారీ షాక్..!
ఐపియల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి భారీ షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం ఉంటున్న వనువాటు ప్రభుత్వం ఆయనకు షాకిచ్చింది. ఆయనకు జారీ చేసిన పాస్ పోర్ట్ రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపట్ పౌరసత్వ కమిషన్ను ఆదేశించారు.
కొన్ని వారాల క్రితం లలిత్ మోదీ వనువాటు పౌరసత్వాన్ని పొందిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, ఇండియాలో దర్యాప్తును తప్పించుకునేందుకు అక్కడి పౌరసత్వాన్ని పొందారని వార్తలొచ్చిన విషయం కూడా తెలిసిందే.