వివేకా హత్య కేసు: ప్రత్యక్ష సాక్షి మృతి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న (85) కడప రిమ్స్ లో మృతి చెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పులివెందుల నుంచి కడప రిమ్స్ కు తీసుకురాగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. రంగన్న వివేకా హత్య జరిగిన సమయంలో ఆ ఇంటికి వాచ్ మెన్ గా పనిచేశారు.