సరిహద్దు రాష్ట్రాల నుండి విద్యార్థుల తరలింపు
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులను తమ స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ భవన్ కు 316 మంది విద్యార్థులు చేరుకున్నారు. అయితే 76 మంది తెలుగు విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకోగా మిగతా 240 మంది విద్యార్థులు ఏపీ, తెలంగాణ భవన్ లో ఉన్నారు. ఈ మేరకు విద్యార్థులకు వసతి,ఆహారం, రవాణా సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.