ఐఐటి కాలేజ్ స్క్రీన్ పై పోర్న్ వీడియోలు.. స్పందించిన విద్యా శాఖ
IIT రాంచీ వెబ్ క్యాస్ట్ లో మాట్లాడుతుండగా సిస్టమ్ ను ఎవరో హ్యాక్ చేసి పోర్న్ ప్లే చేశారని శామ్ పిట్రోడా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను విద్యా శాఖ ఖండించింది. అసలు రాంచీలో IITనే లేదని, అక్కడుంది IIIT అని ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చింది.
పిట్రోడాను ఫిజికల్, డిజిటల్ గా లెక్చరివ్వడానికి పిలవలేదని వారూ స్పష్టం చేశారని, దీన్ని బట్టి IITలను అపఖ్యాతి పాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని తెలిపింది. తాము దీనిని సహించబోమని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని ట్వీట్ చేసింది.