Breaking: తెలంగాణలో భూకంపం
తెలంగాణలో పలు జిల్లాల్లో భూమి కంపించింది. కరీంనగర్, జగిత్యాల్, వేములవాడ, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కొన్ని సెకన్ల పాటు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.