తాగుబోతు వింత ప్రయాణం.. బస్సు కింద వేలాడుతూనే 15 కిలోమీటర్లు...
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు వింత ప్రయాణం చేశాడు. బస్సు వెనుక టైర్ పక్కనే ఉన్న స్పేర్ టైర్ ఎక్కి పడుకున్నాడు. దాదాపు 15 కిలోమీటర్లు బస్సు కింద వేళాడుతూనే ప్రయాణం చేశాడు.
బస్సు వెనుక వస్తున్న వాహనదారులు బస్సు కింద ఎవరో వేలాడుతున్నట్లు గమనించారు. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్ కి చెప్పారు. డ్రైవర్ బస్సు ఆపి వెనుక టైర్ దగ్గర ఏముంది అని చూడగా మందుబాబు పడుకుని ఉండటం చూసి ఖంగు తిన్నాడు. వెంటనే మందు బాబును బస్సు కింద నుంచి బయటకు తీశారు.