రైల్వే స్టేషన్లలో వాటర్ బాటిల్స్ కొనేముందు జాగ్రత్త, ఈ వీడియోనే సాక్ష్యం.
రైల్వే స్టేషన్లలో వాటర్ బాటిల్స్ కొనేముందు ఒకటికి రెండు సార్లు చూసి కొంటే మంచింది. లేకుంటే చేతులారా అనారోగ్యం కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అక్కడ మినరల్ వాటర్ బాటిల్స్ అంటూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఆ నీళ్లు మినరల్ చేసి ఉంచరని అక్కడ కొళాయిల ద్వారా నీటిని పట్టి వాటిని విక్రయించే అవకాశం ఉందని ఈ వీడియో చెబుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే ఓ పిల్లవాడు రైల్వే ఫ్లాట్ ఫాం మీద వాటర్ బాటిల్స్ ని అక్కడ కొళాయి నీళ్లతో నింపి దానికి సీలు స్కిక్కర్ వేశాడు. ఈ లోపు రైలు కూత వినపడ్డంతో అతను పట్టిన బాటిల్స్ అన్నింటిని ఓ బస్తాలో వేసుకుని పరుగులు తీసాడు. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి పోప్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఈ వీడియోని మీరు ఓ సారి చూడవచ్చు.