గాజా నుండి పారిపోండి.. లేదా చచ్చిపోండి: హమాస్ కు ట్రంప్ వార్నింగ్
గాజా నుంచి పారిపోండి అంటూ హమాస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్ పై ట్రంప్ ధ్వజమెత్తారు.
"మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెలుకు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి' అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.