కొడాలి నాని ప్రాణాలు కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ నుండి ముంబైకి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నానిని కాపాడేందుకు డాక్టర్ పాండా రంగంలోకి దిగారు. చాలా పాపులర్ అయిన డాక్టర్ రామకాంత పాండా నానికి సర్జరీ చేయనున్నారు.
డాక్టర్ పాండా పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు. దివంగత మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగోయ్, కొనకళ్ల నారాయణ, రఘురామకృష్ణంరాజులకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు.