ఒక్కో కరోనా రోగికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..!

News Published On : Thursday, June 4, 2020 08:47 PM

కరోనాతో దేశంలో లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరికి అందించే చికిత్స దేశానికి ఎంత ఆర్ధిక భారమో తెలిస్తే కచ్చితంగా మీరు షాక్ అవుతారు . కరోనా బారిన పడిన ఒక రోగికి చికిత్స చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది . మందులు, ఆహారం , పీపీఈ కిట్లు , ప్రత్యేక గదులు, వెంటిలేటర్లు అన్ని కలిపి తడిసి మోపెడు అవుతుంది అని లెక్క చెప్తుంది.

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన రోగి పైన చెప్పిన అన్ని సదుపాయాలతో చికిత్సకు రోజూ రూ .20 నుంచి 25 వేల వరకు ఖర్చవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు .అంటే రోగికి 14 రోజుల చికిత్సకు రూ .2,80,000 నుంచి 3,50,000 మధ్య ఖర్చవుతుందని అంచనా .

వరుసగా మూడు నుండి ఐదు పరీక్షలు చేసి ఆ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే రోగులను డిశ్చార్జ్ చేస్తున్నారు . కొన్ని సందర్భాల్లో, ఖచ్చితమైన ఫలితం పొందడానికి ఎనిమిది నుండి పది సార్లు కూడా పరీక్షలు చెయ్యాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు. 

కరోనా వైరస్ కు సంబంధించిన పరీక్షకు రూ .4,500 ఖర్చవుతుంది. ఇక ఈ రేటును ప్రైవేట్ ల్యాబ్‌ల నిపుణులు మరియు ఇతరుల అభిప్రాయం విన్న తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయించింది. టెస్ట్ కిట్ ధర ఒక్కటే రూ .3,000. ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ గా అనుమానం , లేదా నిర్ధారణ అయితే అతను అంబులెన్స్‌లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.