RGVకి హైకోర్టులో ఊరట
డైరెక్టర్ RGVకి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. 2019లో విడుదలైన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇవి రాజకీయ దురుద్దేశంతో పెట్టినవని, కొట్టేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులపై ఇప్పటికే స్టే విధించిన కోర్టు ఈ రోజు మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.