పెరగనున్న డీజీల్ ధరలు
కర్ణాటకలో డీజీల్ ధరలు పెరగనున్నాయి. డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం 21.7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటరు డీజీల్ ధర రూ.2 పెరిగి రూ.91.02కు చేరుకోనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే బెంగళూరులో ఈ నెల నుంచి చెత్త పన్ను కూడా వసూలు చేయనుంది. నివాస భవనాల విస్తీర్ణాన్ని బట్టి నెలకు రూ.10 నుంచి రూ.400 వరకు చెత్త పన్ను వసూలు చేయనున్నారు.