ప్రణయ్ హత్య కేసు నిందితులు వీళ్ళే.. ఎవరెవరికి ఏయే శిక్షలు?
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఒకరికి కోర్టు ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ1 మారుతీరావు (అమృత తండ్రి), ఏ2 సుభాష్ శర్మ(బిహార్), ఏ3 అస్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), ఏ7 శివ (మారుతీరావు కారు డ్రైవర్), ఏ8 నిజాం (ఆటో డ్రైవర్) ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
కరీం సహాయంతో అస్గర్ కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేయించారు. కాగా 2020లో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.