పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అటవీ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు.