ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలను తీసింది. క్రికెట్ బెట్టింగ్లో దాదాపు రూ.2లక్షలు పోగొట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన 29 ఏళ్ల సోమేశ్ అనే యువకుడు బెట్టింగు బానిసయ్యాడు. బెట్టింగ్ లో ఏకంగా రూ.2 లక్షలు కోల్పోవడంతో చేసేదేమీ లేక రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.