సెబీ చైర్ పర్సన్, మరో ఐదుగురిపై కేసు
సెబీ మాజీ ఛైర్పర్సన్ మాధవీపురి బుచ్, మరో ఐదుగురిపై FIR నమోదు చేయాలని ముంబై ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆర్థిక అవకతవకల వ్యవహారంలో ఈ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
ఆమె పదవిలో ఉండగా రెగ్యులేటరీ ఉల్లంఘనలు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగాయంటూ ఓ జర్నలిస్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు చేసి 30 రోజుల్లో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని అధికారులను ఆదేశించింది.