మళ్లీ మొదలైన కరోనా మరణాలు
కరోనా మరణాలు మళ్లీ మొదలయ్యాయి. ముంబైలో కరోనా సోకిన ఇద్దరు తాజాగా మృతి చెందడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. అయితే వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులున్నాయి.