కరోనా దెబ్బకు స్మశానాలు హౌజ్‌ఫుల్, మృతదేహాలని ఏమి చేస్తున్నారో తెలుసా ..?

News Published On : Saturday, March 28, 2020 07:49 AM

మహమ్మారి కరోనా రోజురోజుకూ బలపడుతూ వేలమందిని పొట్టనపెట్టుకుంటోంది. యూరప్‌లో వైరస్ మృత్యువిలయం సృష్టించడంతో అక్కడి స్మశానాల్లో ఖాళీ లేకుండాపోయింది. శుక్రవారం రాత్రి 10.30 వరకు ప్రపంచ వ్యాప్తంగా 26,350 మంది చనిపోగా, అందులో అత్యధికులు యూరప్ దేశాలకు చెందినవారే కావడం గమనార్హం. అత్యధికంగా ఇటలీలో సుమారు 10 వేల మంది, స్పెయిన్ లో 5వేలు, ఫ్రాన్స్ లో 1700, యూకేలో 759 మంది చనిపోయారు. బ్రిటన్ లో మరణాల రేటు ఎక్కువగా ఉండటం, పాజిటివ్ కేసుల సంఖ్య 15వేలకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

బ్రిటన్ లో గ్రేటర్ లండన్ తర్వాత రెండో అతిపెద్ద కౌంటీ వెస్ట్ మిడ్‌లాండ్స్‌లో కొవిడ్-19 మరణాల రేటు కలవరపెట్టే స్థాయికి చేరింది. దీంతో అక్కడి ప్రఖ్యాత బర్మిగ్ హమ్ సిటీలోని బర్మింగ్ హమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కొవిడ్-19 మార్చురీగా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఎయిర్ పోర్టులోని కార్గొ టెర్మినల్ దగ్గరున్న భవన సముదాయాలను మార్చురీగా మార్చే ప్రక్రియ శుక్రవారమే మొదలైనట్లు శాండ్వెల్ మెట్రోపాలిటన్ కౌన్సిల్ లీడర్ వసీమ్ అలీ మీడియాకు చెప్పారు.