పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ముస్లింలు ఉగ్రవాదులు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని, ముస్లింలను కించ పరిచే విధంగా ఉన్నాయని ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా డిమాండ్ చేశారు.