అల్లు అర్జున్ అస్సలు నువ్వు మనిషివేనా..? సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ, థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అత్యంత బాధ్యతారాహితంగా ప్రవర్తించారన్నారు. అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహించడం వల్లే భారీగా జనాలు థియేటర్ వద్దకు వచ్చారని చెప్పారు. థియేటర్ కు రావొద్దని పోలీసులు చెప్పినా వినలేదు. అల్లు అర్జున్ మనిషేనా? అసలు ఏం మనిషి ఇతను.. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా..?
డీసీపీ వచ్చి అతి బలవంతంగా అల్లు అర్జున్ని కారులో ఎక్కించే వరకూ ఆయన థియేటర్లోనే కూర్చున్నాడు. అల్లు అర్జున్ తిరిగి వెళ్లే సమయంలో తన కారు రూఫ్ టాప్ నుండి బయటకి వచ్చాండటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కనీసం బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించాలన్న బాధ్యత కూడా అల్లు అర్జున్ కు లేదా అని తీవ్ర విమర్శలు చేశారు.