మెగా డీఎస్సీపై చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటివారంలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తామని, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని అన్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తాని ఆయన వెల్లడించారు.