2020 సంవత్సరం లోని సెలవులను ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం..!
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి, బుద్ధపూర్ణిమ, క్రిస్మస్, దసరా, దీపావళి, గుడ్‌ఫ్రైడే, గురునానక్ జయంతి, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహ, మహావీర్ జయంతి, మొహర్రం, మిలాద్ ఉన్ నబిలను తప్పక ఇవ్వవలిసిన సెలవుదినాలుగా ప్రకటించింది. ఈ 14 సెలవు దినాలతో పాటు అదనంగా ఆయా రాష్ర్టాల్లో ప్రాధాన్యాలకు అనుగుణంగా మరో మూడు సెలవులు తీసుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇందులో దసరా పండుగ మరుసటిరోజు, హోలి, జన్మాష్టమి, మహాశివరాత్రి, వినాయకచవితి, మకర సంక్రాంతి, రథయాత్ర, ఓనం, పొంగల్, శ్రీపంచమితోపాటు ఆయా రాష్ట్రాల్లో జరుపుకొనే ఉగాది లాంటి పర్వదినాలలో ఏవైనా మూడు సెలవులు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇవికాకుండా మరో 34 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది.