పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తతలు: రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచన
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ దేశంలోకి అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని పౌరులకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని పేర్కొంది. యుద్ధ సమయంలో పౌరులు స్పందించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించింది.