OYO ఫౌండర్ పై కేసు నమోదు
OYO ఫౌండర్ రితేశ్ అగర్వాల్ పై రాజస్థాన్లో కేసు నమోదైంది. తప్పుడు సమాచారంతో మోసం చేశారని జైపూర్ కు చెందిన సంస్కార రిసార్ట్స్ యజమాని మాధవ్ జైన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లో ఓయోతో సంవత్సర కాలానికి ఒప్పందం చేసుకున్నామని, కానీ 2019-20, 2020-21లోనూ తమ రిసార్ట్స్ బుకింగ్స్ ఓయోలో చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా చూపడం వల్ల రూ.2.66 కోట్ల GST బిల్లు పెండింగ్లో ఉన్నట్లు నోటీసులు వచ్చాయని ఫిర్యాదులో తెలిపారు.