వాట్సప్ లో నిఖా... పోలీస్ స్టేషన్లో పెళ్ళికొడుకు పంచాయితీ
బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్ లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ బాలికను వాట్సాప్లో ఓ బాలుడు పెళ్లాడాడు. నిఖా కబూల్ హై (పెళ్లి సమ్మతమేనా?) అనే మెసేజ్ కు ఇద్దరూ మూడు సార్లు అంగీకారం తెలిపినట్లు చెబుతున్నాడు.
ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి రచ్చ చేశాడు. కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో ఎలాంటి మార్పురాలేదు. పేరెంట్స్ నుంచి అధికారిక ఫిర్యాదు తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు వేచి చూస్తున్నారు.