తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరమని, వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది వాణిజ్య దోపిడీ కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
అంగీకారం లేకుండా మహిళల ఫొటోలు ప్రకటనల్లో వాడుతున్నారని నమ్రత అంకుశ్ అనే మహిళ పిటిషన్ పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ, ఇతరులకు ఆదేశాలిచ్చింది.