నటి అంగాంగంలో బంగారం.. బిజెపి ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరంలోని అంగాంగంలో ప్రతీ చోట బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేసిందన్నారు.
ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మంత్రుల పేర్లను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని అన్నారు. అయితే బిజెపి ఎమ్మెల్యే బసనగౌడ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు.