ఏపీలోకి బర్డ్ ఫ్లూ ఎలా వచ్చిందంటే..
ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు సరస్సుతో పాటు ఇతర జలాశయాల్లోకి పెద్ద సంఖ్యలో వచ్చాయి. వాటి విసర్జన, ముక్కు నుంచి వచ్చే ద్రవం నీటిలో పడితే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
ఈ కొంగలు ఈ జలాశయాల్లో తిరిగి కోళ్ల ఫారాల వద్దకు వెళ్లడంతో వైరస్ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూకు వ్యాక్సిన్ లేదు. కోళ్ల ఫారాల వద్ద పరిశుభ్రత, బయో సెక్యూరిటీ పాటించడమే మార్గం.