ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్
ఏపీలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో ఆయన మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు.
అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించారు.