మెగా డీఎస్సీపై బిగ్ అప్డేట్
ఏపీలో మెగా డీఎస్సీపై బిగ్ అప్డేట్ వచ్చింది. నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. SC వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదంతో జారీ అయ్యే ఆర్డినెన్స్ ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయిస్తారు. ఆ తర్వాతి రోజే నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. ముందుగా చెప్పినట్లే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోగా ప్రక్రియ పూర్తి చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.