BPO ఉద్యోగులకు భారీ షాక్..!
BPO ఉద్యోగులకు భారీ షాక్ తగలనుంది. AI రాకతో BPO, BPM రంగంలో హైరింగ్ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ఆపరేషన్స్ లో రీస్ట్రక్చర్ తప్పనిసరని, ఉద్యోగుల విధులు మారుతాయని చెబుతున్నారు.
డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్టు, లావాదేవీల ప్రక్రియ వంటి సాధారణ పనులకు ఇకపై మనుషుల అవసరం ఉండదని అంటున్నారు. AI టాస్కుల పర్యవేక్షణ, దాంతో పనిచేయించే, కలిసి పనిచేసే ఉద్యోగాల కల్పన మాత్రమే జరుగుతుందని చెబుతున్నారు. అందుకు వారు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.