అల్లు అర్జున్ కేసుపై నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం

News Published On : Saturday, January 11, 2025 02:53 PM

హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినహాయించింది.

ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. దీనికి నాంపల్లి కోర్టు అంగీకారం తెలిపింది. మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది.