జవాన్ కుటుంబానికి బాలకృష్ణ ఆర్థిక సాయం
ఏపీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన జవాన్ మురళి నాయక్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జవాన్ కుటుంబ సభ్యులకు నారా లోకేష్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జవాన్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ తన వంతు సాయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మే 12వ తేదీన మురళి నాయక్ స్వగ్రామం వెళ్ళనున్నారు.