BREAKING: పోసానికి బెయిల్ మంజూరు
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసిపి మద్దతుదారు, సినీనటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో గుంటూరు కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సిఐడి కేసులో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
త్వరలో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు పోసాని ఐదు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించింది.