గొంతు కోసి చెత్తకుండీలో పడేసినా.. చావును గెలిచిన పసికందు
గొంతు కోసి చెత్తకుండీలో పడేసినా ఆ పసికందు చావును గెలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్లో చోటుచేసుకుంది. ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది.
దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లిని, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.