Breaking: కేంద్ర మంత్రిపై దాడికి యత్నం
భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఉండగా భారీ భద్రతా లోపం తలెత్తింది. కొంత మంది ఖలిస్థానీ సానుభూతిపరులు కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై కలకలం సృష్టించారు.
ఓ దుండగుడు ఆయన కారు వద్దకు దూసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడు. భారత జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేసి మిగతా వారిని చెదరగొట్టారు.