7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఏపీలో వచ్చే నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) సేవలను నిలిపేస్తున్నట్లు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని తెలిపింది.
ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చించినా ఫలితం లేకుండా పోయిందని వెల్లడించింది. ఇప్పటివరకు తమ సామర్థ్యానికి మించి సేవలు అందించామని, ఇకపై కొనసాగించలేమని నోటీసులు పంపింది.