1,161 ఉద్యోగాలు.. నేటి నుండి దరఖాస్తులు
CISFలో 1,161 కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో పాసైన 18 నుంచి 23 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.
రిజర్వేషన్ బట్టి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. నెలకు రూ.21,700 నుండి రూ.69,100 జీతం చెల్లిస్తారు. https://cisfrectt.cisf.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.