పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎలాంటి రాతపరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.
బీపీఎం శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, డాక్ సేవక్ జీతం రూ.10,000-రూ.24,470 ఉంటుంది. మార్చి 3 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. indiapostgdsonline.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు.