1,161 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ
CISF భర్తీ చేయనున్న 1,161 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గడువు ఈ రోజు (ఏప్రిల్ 3)తో ముగియనుంది. కానిస్టేబుల్/ట్రేడ్స్ మెన్ పోస్టులకు మెట్రిక్యులేషన్ కలిగి 18 నుండి 23 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు. అన్ రిజర్వ్డ్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, STలకు ఎలాంటి ఫీజు లేదు. నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వేతనం చెల్లిస్తారు. cisfrectt.cisf.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.