ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

News Published On : Friday, February 28, 2025 09:40 PM

ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 300 నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మార్చి 3 వరకు పొడిగించారు. ఇందులో జనరల్ డ్యూటీ (మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ అర్హత) 260 పోస్టులు డొమిస్టిక్ బ్రాంచ్ (టెన్త్ అర్హత) 40 పోస్టులున్నాయి.

అభ్యర్థి వయసు 18 నుండి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిజికల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు ఉంటుంది. దరఖాస్తులను https://joinindiancoastguard.cdac.in/ వెబ్ సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.