Breaking: వాలంటీర్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి డీబీ వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పని చేయడం లేదని స్పష్టం చేశారు. వారిని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడించారు.
ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవిని పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన సమయానికి వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ చేసేవాళ్లమని తెలిపారు. ఈ ప్రకటనలో కూటమి ప్రభుత్వం ఇక వాలంటీర్లను తీసుకునే యోచన లేదని స్పష్టం అవుతోంది.