ప్రతి రైతుకూ రూ. 20,000: శుభవార్త చెప్పిన సీఎం

News Published On : Saturday, January 4, 2025 11:44 AM

ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి రూ. 20,000 చొప్పున సాయం చేసే పథకాన్ని ప్రధాన మంత్రి కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ ను రూ. 6,000 నుంచి కేంద్రం రూ. 10,000 లకు పెంచనుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10,000 కలిపి మొత్తం 20 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వమూ అంతే మొత్తంలో ఇవ్వనుంది.