మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టైలరింగ్లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, కాపు సామాజికవర్గానికి చెందిన, ఆర్థికంగా వెనుకబడిన 1.02 లక్షల మంది మహిళలను ఇందు కోసం ఎంపిక చేయనున్నారు. బీసీ సంక్షేమ శాఖ నుండి 46,044 మందిని, EWS నుండి 45,772 మందిని, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.