ఫీజు రీయింబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
ఫీజు రీయింబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని చెప్పారు.
ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన వెల్లడించారు. తాను జగన్ పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం మూడు రెట్లు అధికంగా చంద్రబాబుతో పోరాడుతున్నానని లోకేశ్ సరదా వ్యాఖ్యలు చేశారు.