పార్కింగ్ ఫీజుకు కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి..
ఏపీలో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్ వద్ద పార్కింగ్ ఫీజు వసూలుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తొలి 30 నిమిషాల వరకు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. వస్తువులు కొన్న బిల్స్ చూపిస్తే 30 నిమిషాల నుంచి 1 గంట వరకు కూడా ఫీజు తీసుకోవద్దని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
సినిమా టికెట్ లేదా ఆ సముదాయంలో పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ మొత్తం విలువైన వస్తువులు కొంటే గంట కంటే ఎక్కువసేపు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.