సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం అమరావతిలో ఉత్తర్వులు జారీ చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో 5 మంది సభ్యులతో కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.